తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణపై భట్టి విక్రమార్క ఆరా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
అర్నబ్ తుపాన్ కారణంగా ఏపీలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరా తీశారని అధికారులు తెలిపారు. ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. తెలంగాణ నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, అవసరమైన సిబ్బందిని పంపిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారని వెల్లడించారు. ఈ పునరుద్ధరణ పనుల్లో రెండు రాష్ట్రాల సిబ్బంది నిమగ్నమయ్యారు.