రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం, అక్రమ కేసులు బనాయించారు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీ గొడవ ఘటనలో బిఆర్ఎస్ నేతలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడంపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చీప్ మినిస్టర్ అని అభివర్ణించారు. అధికార దుర్వినియోగంతో అక్రమ కేసులు బనాయించారని, వీటిని న్యాయస్థానాల్లో చట్టబద్ధంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మిస్ వరల్డ్ పోటీల సమయంలో కాంగ్రెస్ నేతల లైంగిక వేధింపుల ఆరోపణలపై డిజిపి ఏం సమాధానం చెబుతారని ఆయన డిమాండ్ చేశారు.