రేండ్లగూడలోని అల్లం వారి కుంటను కబ్జా నుంచి కాపాడాలని కలెక్టర్కు వినతి

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడలో ఉన్న అల్లం వారి కుంట కబ్జాకు గురైందని గ్రామస్తులు ఆరోపించారు. సర్వే నంబర్ 160, 161 పరిధిలోని సుమారు 24 ఎకరాల కుంట భూమిని కొందరు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన బాధితులు, నేడు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే జాయింట్ కలెక్టర్ ద్వారా సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.