ఆసిఫాబాద్లో బెలూన్ థియేటర్ నిర్వహణ మార్పు: మహిళా సమాఖ్యను తప్పించడంపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: గోపి
స్థలం: ఆసిఫాబాద్
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బెలూన్ థియేటర్ నిర్వహణ భాగస్వామ్యం నుంచి జిల్లా మహిళా సమాఖ్యను తొలగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు తెలిపారు. లాభాల బాటలో నడుస్తున్న సమయంలోనే థియేటర్ నిర్వహణను మరో భాగస్వామికి కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఆశయాలను నీరుగార్చుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.