చిరుప్రాయంలోనే అరుదైన రికార్డు: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన చిన్నారి

రిపోర్టర్: సతీష్ స్థలం: బెంగళూరు

చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ కనబరిచిన బెంగళూరుకు చెందిన నలుగురు సంవత్సరాల బాలుడు అథర్వ కీర్తి సాగర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. సుధామూర్తి రాసిన కథా పుస్తకం నుండి కేవలం ఇరవై ఏడు నిమిషాల వ్యవధిలోనే వెయ్యి ఆరువందల ఇరవై ఆరు ఆంగ్ల పదాలను అనర్గళంగా చదివి ఈ ఘనత సాధించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ అరుదైన ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు అతడిని ప్రత్యేకంగా అభినందించారు.