వైకల్యాన్ని జయించి ఐఐటీ మద్రాస్‌లో సీటు సాధించిన సంతోష్
రిపోర్టర్: నరేష్
స్థలం: తమిళనాడు
చెన్నైకి చెందిన 17 ఏళ్ల సంతోష్ 90 శాతం శారీరక వైకల్యాన్ని జయించి ఐఐటీ మద్రాస్‌లో సీటు సాధించాడు. ఆటో డ్రైవర్ కుమారుడైన సంతోష్, చిన్నతనం నుంచి సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లిదండ్రుల కష్టం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పట్టుదలగా చదివి ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.