గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదులో ఉదాసీనత: నవంబర్ ఆరుతో ముగియనున్న గడువు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Warangal
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై తీవ్ర ఉదాసీనత వ్యక్తమవుతోందని అధికారులు తెలిపారు. మార్చిలో జరుగనున్న ఈ ఎన్నికల కోసం ఓటరు నమోదు గడువు నవంబర్ ఆరుతో ముగియనుండగా, నిరుద్యోగులు పెద్దగా ముందుకు రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ, గత పాలకుల నిర్లక్ష్యంతో నిరుద్యోగులు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.