అమెరికా వీసా నిబంధనలపై ట్రంప్ సర్కార్కు కోర్టు షాక్
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల వీసా కాలవ్యవధిపై పరిమితులు విధించే ట్రంప్ సర్కార్ ప్రతిపాదనను బోస్టన్ జిల్లా కోర్టు అడ్డుకుంది. 50 ఏళ్లుగా అమలవుతున్న విధానాన్ని ఒక్కసారిగా మార్చడం సరైనది కాదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన అమలయితే ఉన్నత విద్యారంగంతోపాటు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని కోర్టు హెచ్చరించింది.