జాతీయ రహదారిపై జియో బంకులో నిల్చిన డీజిల్ సరఫరా
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరికుంటపాడు
వరికుంటపాడు మండలం నేషనల్ హైవే ఎన్.హెచ్ 17 సమీపంలోని జియో పెట్రోల్ బంకులో డీజిల్ నిల్వలు పూర్తిగా అడుగంటడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు చూసినా ఈ బంకులో ఇదే పరిస్థితి తలెత్తుతోందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర ప్రయాణాల్లో ఉన్నామని ఎంత మొరపెట్టుకున్నా బంకు సిబ్బంది పట్టించుకోవడం లేదని, తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఇంధన కొరతను నివారించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.