స్థానిక ఎన్నికల వేళ సీ-విజిల్ యాప్: నూతన విధానంతో కేంద్ర ఎన్నికల సంఘం
రిపోర్టర్: రాము
స్థలం: నెల్లూరు
జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఎక్కడైనా అక్రమాలు జరిగితే ఈ యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లోపే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫొటో, వీడియోతో పాటు జీఐఎస్ సమాచారం కూడా నేరుగా ఈసీకి చేరుతుందని వివరించారు.