కార్నెల్ విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కలకలం
రిపోర్టర్: మహేష్
స్థలం: New York
కార్నెల్ విశ్వవిద్యాలయంలోని కాఫీ ఫ్రాటర్నిటీ హౌస్లో తనపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ నివేదించింది. ఈ ఘటనపై తాను వంద శాతం కచ్చితత్వంతో చెప్పగలను అని ఆమె స్పష్టం చేశారు. అయితే ప్రాథమిక విచారణ సమయంలో ఆ వాంగ్మూలాన్ని పరిశీలించలేదని జిల్లా అటార్నీ మాథ్యూ వాన్ హౌటన్ తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో దర్యాప్తును పునఃప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.