పర్యావరణ శాస్త్రవేత్తల పరిశోధన: గడ్డి భూముల్ లో భారీగా పెరిగిన కీటకాల సంఖ్య
రిపోర్టర్: హరి
స్థలం: జర్మనీ
గడ్డి భూములలో భూ వినియోగాన్ని తగ్గిస్తే కీటకాల సంఖ్య అద్భుతంగా పెరుగుతుందని జర్మనీ పరిశోధకులు వెల్లడించారు. ఏడాదిలో ఒక్కసారే గడ్డిని కత్తిరించడం వల్ల జీవవైవిధ్యం మెరుగవుతుందని సైన్స్ డైరెక్ట్ అధ్యయనం స్పష్టం చేసింది. మూడు సంవత్సరాల కాలంలో కీటకాల సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని పరిశోధకులు వివరించారు. ఎరువులు, పశువుల మేతను పూర్తిగా నిలిపివేయడం ద్వారా పురుగుల ఉనికి గణనీయంగా పుంజుకుందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.