మానవజాతికి ముప్పు: ఆంత్రోపిక్ ఏఐ పరిశోధకుడు సంచలన రాజీనామా

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

కృత్రిమ మేధస్సు సంస్థలు మానవాళి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆంథ్రోపిక్ మాజీ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ సంచలన ఆరోపణలు చేశారు. సూపర్ ఇంటెలిజెన్స్ కోసం జరుగుతున్న పోటీ మానవజాతి అంతానికి దారితీస్తుందని హెచ్చరిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ సంస్థలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని, రాబోయే కొద్ది సంవత్సరాలలో ఏఐ మానవాళిని నాశనం చేసే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.