ఖమ్మంలో తీవ్ర విషాదం అప్పుల బాధతో తండ్రి కుమార్తె ఆత్మహత్య

రిపోర్టర్: విజయ్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన రైతు పసులూరి శ్రీనివాసరావు అప్పుల బాధతో తన కుమార్తె లాస్యతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కౌలు వ్యవసాయంలో వచ్చిన తీవ్ర నష్టాలు మరియు సుమారు పది లక్షల అప్పుల భారం కారణంగా ఆయన ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి పిల్లలకు ఇవ్వగా శ్రీనివాసరావు, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు నిఖిల్ ప్రాణాలతో బయటపడ్డాడు.