కేరళ ఎన్నికలకు నిధుల మళ్లింపుపై రేవంత్ రెడ్డిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని కేరళ ఎన్నికలకు మళ్లించారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై BJP Telangana తీవ్రస్థాయిలో మండిపడింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మెప్పుకోసమే రాష్ట్ర ప్రజల సొమ్మును ఎన్నికల నజరానాగా ఇచ్చారని విమర్శించింది. హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునేందుకే ఈ నిధుల మళ్లింపు జరిగిందని, సొంత పార్టీ నేతలే ఈ వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నారని పేర్కొంటూ BJP Telangana అధికారిక ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించింది.