ఏలేరు రిజర్వాయర్లో భారీగా చేప పిల్లల విడుదల: మత్స్యకారులకు ఉపాధి కల్పన
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: ఏలేశ్వరం
ఏలేశ్వరం మండలంలోని జె.అన్నవరం గ్రామంలో ఏలేరు రిజర్వాయర్లో మత్స్యశాఖ అధికారులు పదకొండు లక్షల నలభై వేల చేప పిల్లలను గురువారం సాయంత్రం విడుదల చేశారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించడంలో భాగంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఈ చేప పిల్లలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యశాఖ అధికారులు, తహసీల్దార్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.