మత్స్యకార కుటుంబాలకు యాభై కిలోల ఉచిత బియ్యం అందజేత
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
తీవ్ర వాయుగుండం కారణంగా సముద్రంలో వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించింది. ఉపాధి కోల్పోయిన అర్హులైన ప్రతి కుటుంబానికి యాభై కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాంధ్ర వరదలు మరియు భారీ వర్షాల పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికార యంత్రాంగాన్ని స్పష్టం చేశారు.