ఘట్కేసర్ ఫామ్‌హౌస్‌లో విషాదం: పుట్టినరోజు వేడుకకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
రిపోర్టర్: అశోక్
స్థలం: ఘట్కేసర్
హైదరాబాద్‌లోని ఘట్కేసర్ ఎడులాబాద్ ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకకు వెళ్లిన ఇరవై ఒక్క ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి కృష్ణ కౌండిన్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం రాత్రి స్నేహితులతో కలిసి వెళ్లిన అతను ఉదయం విగతజీవిగా పడి ఉన్నాడని ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ కిరణ్ తెలిపారు. మృతుడి తండ్రి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.