కొరియా ఓపెన్ కు దూరమైన లక్ష్య సేన్, పీవీ సింధు

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

హైలో ఓపెన్ టోర్నీలో అద్భుత విజయాల తర్వాత ప్రముఖ భారత షట్లర్లు లక్ష్య సేన్, పీవీ సింధు కొరియా ఓపెన్ కు దూరంగా ఉంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నీలో భారత జట్టుకు సీనియర్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్, యువ షట్లర్ తన్వి శర్మ నాయకత్వం వహిస్తారని నిర్వాహకులు వెల్లడించారు. జర్మనీలో జరిగిన విజయాల అనంతరం విశ్రాంతి తీసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.