సాయి హర్ష పెళ్లిలో సందడి చేసిన రామిరెడ్డి ధ్వజారెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రైల్వేకోడూరు

రైల్వేకోడూరులో సీనియర్ నాయకులు రాజగోపాల్ కుమారుడు సాయి హర్ష, అమ్రీన్ వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, కోడూరు మండల అధ్యక్షులు రామిరెడ్డి ధ్వజారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రామిరెడ్డి రాజ్కుమార్ రెడ్డి, మాజీ సర్పంచులు చెంగల్ రెడ్డి, గోపి, రమణ రెడ్డి సహా పలువురు పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.