బైక్పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: శేఖర్ స్థలం: నర్సంపేట

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన సామల మల్లయ్య బైక్పై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలట్ వైనాల నాగరాజు, ఈఎంటీ ప్రవీణ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ ద్వారా నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.