రాజాపేటలో శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గణనాథునికి ఘన పూజలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో చర ప్రతిష్ట చేసిన నవరాత్రి ఉత్సవాల వినాయక స్వామివారికి సోమవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ శాశ్వత అధ్యక్షులు నంగునూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చక స్వాములు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి శ్రీనివాసులు రమాదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు మహా మంగళ నీరాజనం సేవ నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.