బీజేపీలో కొండా సురేఖ చేరికపై మురళీధర్ రావు కీలక స్పష్టత

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

కాంగ్రెస్ నేత కొండా సురేఖ బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారాన్ని ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు ఖండించారు. ఇది కాంగ్రెస్ అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న తప్పుడు ప్రచారమని ఆయన మండిపడ్డారు. పార్టీలో చేరికలకు కచ్చితమైన నిబంధనలు ఉంటాయని, ఎవరిని పడితే వారిని ఆహ్వానించబోమని తేల్చిచెప్పారు. తెలంగాణలో బీజేపీ మాత్రమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.