వలస నేతల ప్రాధాన్యంతో భగ్గుమన్న కాంగ్రెస్ సీనియర్ల ఆక్రోశం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మత్తమరి సూరిబాబు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన సీనియర్ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలని నేతలు సూచించారు. కొత్తగా వచ్చిన వలస నేతలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ వైఖరి మార్చుకోకపోతే పార్టీ అధిష్టానానికి నేరుగా ఫిర్యాదు చేస్తామని ఈ సమావేశంలో ముఖ్య నాయకులు స్పష్టం చేశారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది.సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అబ్జల్, మునిమంద రమేష్, నయుం బాయ్, రొడ్డ శ్యామ్, ఎండీ గౌస్, జక్కుల శ్రీధర్, చిప్ప మనోహర్, బొడ్డు నారాయణ, కటకం సతీష్, సిలివేరి సత్యనారాయణ, సూరం బానేష్, మేకల శ్రీనివాస్, మత్తమరి సత్తిబాబు, మంగమూర్తి, దాసరి సంజీవ్, మత్తమరి జగన్, బైరి శ్రీనివాస్, మత్తమరి శ్రీనివాస్, రాజబ్రహ్మం, గడ్డం అశోక్, కళ్యాణం పోషం, అజీమ్ భాయ్, ఎండీ రహీం, హరీష్ పాండే, బబ్లు భాయ్, ఆర్ఎం సింగ్, నక్క కృష్ణ, రాజారత్నం, చిన్న జీలకర్ర వాసు, సబ్బని రాజనర్సు, టీఎల్ చారి, జంజరాల మనోహర్, కుమ్మరి శంకర్, జూపాక లక్ష్మీనారాయణ, మల్లేష్, బాబురావు, సోగాల రవి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.