ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్న మేనేజర్ దీపిక
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లులో లయన్స్ క్లబ్ మరియు రామ్ రెడ్డి లయన్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ దీపిక దీన్ని ప్రారంభించి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో 55 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 25 మందిని ఆపరేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.