గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న మండల పరిషత్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
ఎచ్చెర్ల మండలం బడివానీపేట పంచాయతీ పరిధిలో రూ.11 లక్షల జనరల్ ఫండ్ నిధులతో నిర్మించిన మూడు సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి ఆదివారం ప్రారంభించారు. కొత్త దిబ్బలపాలెంలో రూ.5 లక్షలు, శివాజీ దిబ్బలపాలెం నుంచి బీచ్ వరకు రూ.3 లక్షలు, రాళ్లపేటలో మరో రూ.3 లక్షలతో ఈ రోడ్లు నిర్మించడం జరిగింది. గత ఐదేళ్ల కాలంలో మండల పరిషత్ ద్వారా గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరిగాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.