గ్రీన్ దీపావళితో పర్యావరణాన్ని రక్షించాలంటూ విద్యార్థుల సమర శంఖం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఎకో క్లబ్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని రక్షించుకోవాలని ప్రిన్సిపల్ మదన్మోహన్ పిలుపునిచ్చారు. వాయు కాలుష్యాన్ని అరికట్టేలా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేశారు.