స్థానిక ఎన్నికల అడ్డుకోలుపై వైకాపాపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ధ్వజం

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకే వైకాపా కోర్టులను ఆశ్రయిస్తోందని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి రాజకీయ ప్రాతినిధ్యం పెంచుతామనే భయంతోనే ఆ పార్టీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. బీసీల సాధికారతపై వైకాపాకు చిత్తశుద్ధి లేదని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి పార్టీలు విజయఢంకా మోగిస్తాయని మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.