ఆనంద్ దేవరకొండ సినిమాపై ప్రశంసలు కురిపించిన రష్మిక

రిపోర్టర్: సునీల్ స్థలం: తెలంగాణ

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' సినిమాను అభినందిస్తూ ప్రముఖ నటి రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విభిన్నమైన కథాంశంతో పాటు ఎంటర్‌టైనింగ్‌గా ఉందని కొనియాడారు. ఆనంద్‌ను 'గ్రీన్ ఫారెస్ట్' అంటూ ప్రశంసించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.