సినీ ఆర్టిస్ట్ సంఘం నిధుల గోల్మాల్: పూనమ్ ధిల్లాన్‌పై సంచలన ఆరోపణలు
రిపోర్టర్: రమేష్
స్థలం: Mumbai
సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిధుల గోల్మాల్ వివాదం బాలీవుడ్లో తీవ్ర కలకలం రేపుతోంది. అసోసియేషన్‌కు చెందిన సుమారు తొంభై లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను పూనమ్ ధిల్లాన్, పద్మిని కొల్హాపురే అక్రమంగా బ్రేక్ చేశారని ప్రముఖ నటి ఉపాసన సింగ్ సంచలన ఆరోపణలు గుప్పించారు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయబడి ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లఘించి నిధులను మళ్లించారని ఆమె వెల్లడించారు. సంఘంలోని ప్రస్తుత వివాదాల నేపథ్యంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.