సెమీకండక్టర్ రంగంలో ఏఐ సంచలనం: ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి స్టార్టప్నకు భారీ నిధులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: చెన్నై
కృత్రిమ మేధస్సు రంగంలో చిప్స్ తయారీ సవాళ్లను అధిగమించేందుకు ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి ఆకాశ్ రాందాస్ కీలక అడుగు వేశారు. తన సహచరుడు అద్వైత్ శ్రీధర్తో కలిసి డిస్కవర్డ్ మెటీరియల్స్ పేరుతో ఆయన స్టార్టప్ స్థాపించారు. సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన కొత్త పదార్థాల అన్వేషణకు ఏఐ ఏజెంట్లను ఉపయోగిస్తున్న ఈ సంస్థ తాజాగా తొమ్మిది మిలియన్ డాలర్ల సీడ్ నిధులను సమీకరించినట్లు వ్యవస్థాపకులు వెల్లడించారు.