ముంబై ఫైవ్ స్టార్ హోటల్ లో బేబీ బొద్దింక కలకలం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Mumbai

ముంబైలోని ప్రసిద్ధ జెడబ్ల్యూ మారియట్ హోటల్ లో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ సేత్ భోజనం చేస్తుండగా టేబుల్ పై బేబీ బొద్దింక కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ మరియు మహారాష్ట్ర ఎఫ్ డి ఏ కమిషనర్ తుకారాం ముండేను ట్యాగ్ చేశారు. ఫైవ్ స్టార్ హోటళ్లలో పరిశుభ్రత లోపించడం దేశానికే అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.