యశస్వి జైస్వాల్‌పై శ్రీలంక బౌలర్ దూషణల వివాదం వెలుగులోకి
రిపోర్టర్: గోపి
స్థలం: కొలంబో
శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను లంకేయ పేసర్ అషిత ఫెర్నాండో దూషించాడని వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ వెల్లడించాడు. ఔటైన తర్వాత జైస్వాల్ నిశ్శబ్దంగా పెవిలియన్‌కు వెళ్తుండగా ఫెర్నాండో నిరంతరం అసభ్య పదజాలంతో దూషించాడని జురెల్ స్పష్టం చేశాడు. ఈ అనుచిత ప్రవర్తన కారణంగానే జైస్వాల్ మళ్లీ వెనక్కి తిరిగి ప్రతిఘటించాల్సి వచ్చిందని, అయితే తాను ఎప్పుడూ ముందుగా గొడవలకు దిగనని జైస్వాల్ చెప్పినట్లు జురెల్ వివరించాడు.