డెంగ్యూ మలేరియా వ్యాధుల కట్టడికి ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాల్సిందే

రిపోర్టర్: MC KISHORE స్థలం: నారాయణవనం

నారాయణవనం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సమావేశం నిర్వహించారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప్ కుమార్ హాజరై ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని పిలుపునిచ్చారు. వైద్యాధికారి డాక్టర్ హర్షిత్ రాజ్ మాట్లాడుతూ జ్వరాల బాధితులను వెంటనే ఆసుపత్రికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొని వ్యాధుల కట్టడిపై తగిన అవగాహన కల్పించారు.