రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన యాదాద్రి భువనగిరి కబడ్డీ జట్లు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు క్రీడా మైదానంలో నిర్వహించిన సబ్ జూనియర్, జూనియర్ విభాగాల కబడ్డీ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో బీర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్ల అనిత ఐలయ్య క్రీడాకారులకు దుస్తులు అందజేశారు. ఈనెల 26 నుండి వేములవాడలో జరిగే రాష్ట్ర క్రీడల్లో వీరు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.