స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు మరియు అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మరియు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తెచ్చింది. ఇకపై కేవలం క్రీడా ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే సరిపోదని, అభ్యర్థులకు తప్పనిసరిగా స్కిల్ టెస్ట్ నిర్వహించాలని స్పష్టం చేసింది. నకిలీ సర్టిఫికెట్ల ద్వారా అనర్హులు లబ్ధి పొందుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిజమైన ప్రతిభ గల క్రీడాకారులకు న్యాయం చేసేందుకు శాప్ ఆధ్వర్యంలో ఈ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.