హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థినిపై ఎనిమిది మంది సామూహిక అత్యాచారం.

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మచ్చబొల్లారంలో 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిపై ఎనిమిది మంది యువకులు మత్తుమందు, గంజాయికి అలవాటు చేసి పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓయో గది, కారు, రైలులో అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిందితుల చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలపడంతో, తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.