ఘట్కేసర్లో అక్రమ మద్యం విక్రయాలపై ఎస్ఓటీ పోలీసుల దాడి
రిపోర్టర్: సునీల్
స్థలం: ఘట్కేసర్
గణేష్ నిమజ్జనం వేళ నిబంధనలకు విరుద్ధంగా కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సురేందర్ రెడ్డి నగర్లో గల స్వప్న కిరాణా దుకాణంలో ఈ దాడి జరిగింది. వివిధ బ్రాండ్లకు చెందిన సుమారు లక్షా పదహారు వేల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని మేడిపల్లి పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు.