హోంమంత్రి డీజీపీ తప్పుకోవాలంటూ అంబటి రాంబాబు డిమాండ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: గుంటూరు
సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ నైతిక బాధ్యత వహించి వెంటనే తమ విధుల నుంచి తప్పుకోవాలని వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పోలీసు అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.