రామప్ప ఆలయానికి మైనింగ్తో ఎలాంటి ముప్పు లేదు: సింగరేణి సంస్థ స్పష్టీకరణ

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

రామప్ప ఆలయానికి బొగ్గు గనుల తవ్వకాల వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లదని సింగరేణి కాలరీస్ సంస్థ స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలని, భవిష్యత్తులో మైనింగ్ కార్యకలాపాలపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి అధికారులు వెల్లడించారు. చారిత్రక కట్టడమైన ఆలయానికి నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని సంస్థ హామీ ఇచ్చింది.