విశాఖలో ఏపీ తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం వేలంపేటలో రాష్ట్రంలోనే తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. రూ.28.44 కోట్ల వ్యయంతో 177 పేద కుటుంబాల కోసం 12 అంతస్తుల మోడల్ అపార్ట్‌మెంట్ నిర్మించనున్నారు. షియర్ వాల్ సాంకేతికతతో కేవలం 9 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మురికివాడలను దశలవారీగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.