హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు భారత్ సహా నాలుగు దేశాలకు మినహాయింపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: టెహ్రాన్
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఉన్న ఆంక్షల నుంచి భారత్ తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్ మొగద్దమ్ స్పష్టం చేశారు. ఈ నాలుగు దేశాల నౌకలు ఇకపై ఎలాంటి అవరోధాలు లేకుండా స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని ఆయన తెలిపారు.