తాండూర్ లో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తాండూర్
మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ వేదికగా సెప్టెంబర్ 7న అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర మూడవ మహాసభల పోస్టర్లను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో యువతి, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు సూరం సాయిరాణి, కార్యదర్శి కొండు సాయికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు తెలిపారు.