ఉక్రెయిన్ పై రష్యా దళాల దండయాత్ర మరియు కొత్త ప్రాంతాల ఆక్రమణ
రిపోర్టర్: నరేష్
స్థలం: రష్యా
ఉక్రెయిన్ లోని ఖార్కివ్, డొనెట్స్క్ మరియు జపోరిజ్జియా ప్రాంతాలలో తాము కొత్తగా నాలుగు స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లొషాకోవో, కొమిస్సరోవో, మార్యెవ్కా, గులెవో మరియు జెలెనా డిబ్రోవా ప్రాంతాలను తమ బలగాలు కైవసం చేసుకున్నట్లు మాస్కో స్పష్టం చేసింది. అయితే ఈ వాస్తవాలను స్వతంత్ర ధృవీకరణ ద్వారా నిర్ధారించలేమని నివేదికలు పేర్కొంటున్నాయి.