శబరిమల భక్తులకు అలర్ట్: గదుల బుకింగ్లో కీలక మార్పులు చేసిన బోర్డు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శబరిమల

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కొన్ని కీలక మార్పులు చేస్తోందని అధికారులు తెలిపారు. ఆన్లైన్ ద్వారా దర్శన టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఇకపై వసతి గదులు కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దళారుల జోక్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఆన్లైన్ బుకింగ్లో ఓటీపీ విధానం ప్రవేశపెడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.