బెంగళూరులో దారుణం: రాంగ్ రూట్ డ్రైవింగ్ నిలదీసిన యువతిపై వ్యక్తి దాడి
రిపోర్టర్: విజయ్
స్థలం: Bengaluru
బెంగళూరులోని బనశంకరిలో రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఒక రీసెర్చ్ స్కాలర్ యువతిని రోంగ్ రూట్ డ్రైవింగ్ పై నిలదీసినందుకు దుండగుడు ఆమె స్నేహితురాలి అపార్ట్ మెంట్ వరకు వెంబడించి అత్యంత పాశవికంగా దాడి చేశాడని చన్నమ్మనకె అచుకట్టు పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 30న జరిగిన ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.