విజయనగరంలో గణేష్ ఉత్సవాలు.. ఆన్లైన్ అనుమతులు తప్పనిసరి!

రిపోర్టర్: తాడి స్థలం: విజయనగరం

విజయనగరంలో వినాయక చవితి వేడుకల నిర్వహణపై రెండో పట్టణ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. కొత్తపేట, హుకుంపేట ప్రాంతాల్లో వేణుగోపాల్ గుడి వద్ద నిర్వహించిన సమావేశంలో కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, సుధారాణి పాల్గొని అవగాహన కల్పించారు.

గణేష్ మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానం ద్వారా ఆన్లైన్లో తప్పనిసరిగా అనుమతులు పొందాలని వారు స్పష్టం చేశారు. ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని, నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.