పోషణ మాసంతో పల్లెర్లలో వెల్లివిరిసిన ఆరోగ్య చైతన్యం

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ తండ మంజుల నర్సింహ గౌడ్ మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ జి వాణిశ్రీ, ప్రధానోపాధ్యాయురాలు వి కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.