భారీ వర్షాలకు కుంకుమపూడిలో కూలిన నిరుపేద ఇల్లు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: జి.కె.వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం కుంకుమపూడి గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ నిరుపేద ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిరంతర వర్షాల కారణంగా గ్రామంలోని మరిన్ని ఇళ్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి బాధితుడిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.