భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భక్తులతో కిటకిటలాడిన పాల్వంచ పెద్దమ్మగుడి

రిపోర్టర్: నరేష్ స్థలం: పాల్వంచ

పాల్వంచ మండలం కేశవాపురం జగన్నాధపురంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడిందని ఈఓ ఎ. విజయ్ కుమార్ తెలిపారు. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, అన్నదానం వంటి ప్రత్యేక వసతులు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే సోమవారం ఉదయం దేవస్థానంలో ఫంక్షన్ హాల్స్, షాపులు, వివిధ హక్కుల కోసం టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.